|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:30 PM
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో శనివారం జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైవ్ మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ జనసేనపార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి కొనసాగుతుందని కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News