|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 03:23 PM
దేశంలో గ్యాస్ కొరత చర్చల నేపథ్యంలో LPG, CNG, PNG, LNG గ్యాస్ రకాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఎల్పీజీ గృహాలలో వంట కోసం సిలిండర్లలో సరఫరా చేస్తారు. సీఎన్జీ ప్రధానంగా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది మీథేన్ ఆధారిత గ్యాస్. పీఎన్జీ పైప్‌లైన్‌ల ద్వారా ఇళ్లకు నేరుగా వచ్చే సహజవాయువు. ఈ గ్యాస్‌ని వినియోగించిన మేరకు మీటర్ ద్వారా బిల్లు చెల్లిస్తారు. ఎల్ఎన్జీ అనేది సహజవాయువును -162°C వరకు చల్లబరచి ద్రవంగా మార్చిన రూపం. దీనిని ఓడల ద్వారా రవాణా చేసి తర్వాత పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తారు. కాబట్టి, ప్రతి గ్యాస్ వినియోగం, నిల్వ విధానం వేర్వేరుగా ఉంటుంది.
Latest News