|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 11:23 AM
తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది 2026 మార్చి 19న ప్రారంభం కానుంది. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, గడపలకు పసుపు కుంకుమ రాసి, మామిడి తోరణాలు కట్టి, కులదైవంతో పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడిని పూజించాలని పండితులు వివరిస్తున్నారు. ఉగాది పచ్చడి తినాలి, నీటి కుండను దానంగా ఇవ్వాలి. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం, మాంసాహారం, మద్యం సేవించడం, పొగతాగడం, దక్షిణ దిశగా కూర్చొని పంచాంగ శ్రవణం వినడం, గొడవ పడటం, చిరిగిన దుస్తులు ధరించడం, ఎవరినీ అవమానించడం వంటివి చేయకూడదు. ఈ నియమాలు పాటించకపోతే ఏడాది మొత్తం అశుభంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
Latest News