|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 11:36 AM
వేసవిలో చర్మ సంరక్షణకు ముల్తానీ మట్టి సహజమైన పరిష్కారం. ఇది ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం. చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించి, అదనపు జిడ్డును పీల్చుకొని మొటిమలను తగ్గిస్తుంది. సన్ టాన్‌ను తగ్గించి చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, నీటితో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి, మెడకు పట్టించి 15–20 నిమిషాల తర్వాత కడగాలి. వారానికి ఒకటి, రెండు సార్లు వాడితే మంచి ఫలితం ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్నవారు పాలు, తేనె కలిపి వాడాలి.
Latest News