|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:45 PM
చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే భుజాలు, వెన్ను, కాళ్లలో నొప్పి, గట్టిదనం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలని వైద్యులు వివరిస్తున్నారు. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడం వల్ల కండరాలు, కీళ్లలో అసౌకర్యం కలిగి నొప్పి వస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకుండా ఉండటం, 7-8 గంటలు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలంటున్నారు
Latest News