|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:39 PM
రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాల విషయంలో అలానే మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ఎస్పీల బాధ్యత అని, గృహ హింస కేసుల్లోనూ నిందితులకు భయం పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. అలానే ఇటీవల వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బాణసంచా తయారీ యూనిట్లు, పేలుడు పదార్థాల నిల్వలపై తక్షణమే దాడులు చేసి తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులను సమీక్షించాలని ఆదేశించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని సీఎం గుర్తుచేశారు. గత పాలనలో పేట్రేగిపోయిన గంజాయి, డ్రగ్స్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నెల్లూరులో గుర్తించిన తరహాలో ఇతర జిల్లాల్లోనూ రౌడీ ముఠాలపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించడంతో పాటు, డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా బాధితుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు.
Latest News