|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:32 PM
రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ని గత ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్ చేసాడని విచారణ నడుస్తున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌కు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నందున, ఆమె బాగోగులు చూసుకునేందుకు వీలుగా ఈ నెల 22వ తేదీ వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకాకుండా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి మార్చి 23న ఉదయం 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు. .ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సునీల్ నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Latest News