|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:44 PM
నేడు విశాఖపట్నంలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమై కీలక చర్చలు జరిపారు. సుమారు 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో విశాఖలో ఒక భారీ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ ప్రతిపాదించారు.దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.అలానే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు కో-డెవలప్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని లోకేశ్ కోరారు. ఏపీలో 'క్వాంటం వ్యాలీ' అభివృద్ధికి, డెడికేటెడ్ క్వాంటం వర్టికల్ స్థాపనకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Latest News