|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:38 PM
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
Latest News