|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:37 PM
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష లో భాగంగా ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా 'గణాంకాలతో కూడిన రేటింగ్స్' ప్రకటించారు. ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందరికంటే వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన పనితీరుపై సీఎం ప్రశంసలు కురిపించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే, కీలకమైన హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరి స్థానంలో నిలవడం గమనార్హం. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల పరిపాలన కుంటుపడుతుందని, నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
Latest News