|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:56 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించిన శ్రీ వైయస్ జగన్, ఆ తర్వాత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... మన పార్టీ ఆవిర్భవించి ఈరోజుకు 15 ఏళ్లు పూర్తి. 2011, మార్చి 12న పుట్టిన మన పార్టీ, ఈరోజుకి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలోనే ఒక మార్క్‌గా నిల్చింది. రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ప్రబలంగా మన పార్టీ కనిపిస్తోంది. 15 సంవత్సరాల క్రితం ఈ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టింది అనేది మనం ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే.. ఆరోజు నల్లకాలువలో ఇచ్చిన ఒక మాట, మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన, ఎదుగుదలకు కారణమైంది. ఆ ఒక్క మాట నా కుటుంబ పరిస్థితులు మార్చింది. రాష్ట్రంలో దశ, దిశ మార్చింది. ఆ ఒక్క మాట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. విలువలతో కూడిన రాజకీయాలు మర్చిపోయి ఉన్న పరిస్థితుల మధ్య.. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్ధం చెబుతూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుక, ఆ తర్వాత ఎదుగుదల కొనసాగింది. ఈరోజు నేను ఒకటే చెబుతున్నాను. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక్క జగన్‌ది మాత్రమే కాదు. కొన్ని కోట్ల మంది వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులది అని తెలిపారు.
Latest News