ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల,,,,మొదటి 20 మ్యాచ్‌ల వివరాలు ప్రకటన
 

by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:53 PM

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలైంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తొలుత నిర్వహకులు.. మొదటి 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.


వాస్తవానికి ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఆర్సీబీతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 దాకా తొలి విడత మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే నెలలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక.. ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు ఐపీఎల్ నిర్వహకులు తెలిపారు.


మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్..


మార్చి 28 - ఆర్సీబీ vs సన్‌రైజర్స్ (బెంగళూరు)


మార్చి 29 - ముంబై vs కోల్‌కతా (ముంబై)


మార్చి 30 - రాజస్థాన్ vs సీఎస్కే (గువహటి)


మార్చి 31 - పంజాబ్ కింగ్స్‌ vs గుజరాత్ టైటాన్స్‌ (న్యూ ఛండీగర్‌)


ఏప్రిల్ 1 - లక్నో vs ఢిల్లీ (లక్నో)


ఏప్రిల్ 2 - కోల్‌కతా vs సన్‌రైజర్స్‌ (కోల్‌కతా)


ఏప్రిల్ 3 - సీఎస్కే vs పంజాబ్ కింగ్స్‌ (చెన్నై)


ఏప్రిల్ 4 - ఢిల్లీ vs ముంబై (ఢిల్లీ)


ఏప్రిల్ 4 - గుజరాత్ vs రాజస్థాన్‌ (అహ్మదాబాద్‌)


ఏప్రిల్‌ 5 - సన్‌రైజర్స్‌ vs లక్నో (హైదరాబాద్‌)


ఏప్రిల్ 5 - ఆర్సీబీ vs చెన్నై (బెంగళూరు)


ఏప్రిల్ 6 - కోల్‌కతా vs పంజాబ్‌ (కోల్‌కతా)


ఏప్రిల్ 7 - రాజస్థాన్‌ vs ముంబై (గువహటి)


ఏప్రిల్‌ 8 - ఢిల్లీ vs గుజరాత్ (ఢిల్లీ)


ఏప్రిల్ 9 - కోల్‌కతా vs లక్నో (కోల్‌కతా)


ఏప్రిల్ 10 - రాజస్థాన్ vs ఆర్సీబీ (గువహటి)


ఏప్రిల్ 11 - పంజాబ్ vs సన్‌రైజర్స్‌ (న్యూ చండీగర్‌)


ఏప్రిల్ 11 - సీఎస్కీ vs ఢిల్లీ (చెన్నై)


ఏప్రిల్ 12 - లక్నో vs గుజరాత్ (లక్నో)


ఏప్రిల్ 12 - ముంబై vs ఆర్సీబీ (ముంబై)


వీటిల్లో ఏప్రిల్ 4 - ఢిల్లీ vs ముంబై (ఢిల్లీ), ఏప్రిల్‌ 5 - సన్‌రైజర్స్‌ vs లక్నో (హైదరాబాద్‌), ఏప్రిల్ 11 - పంజాబ్ vs సన్‌రైజర్స్‌ (న్యూ చండీగర్‌), ఏప్రిల్ 12 - లక్నో vs గుజరాత్ (లక్నో) మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30కి ప్రారంభం కానున్నాయి.

Latest News
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM
Jharkhand HC orders formation of three-member panel to monitor open jails in state Mon, Apr 13, 2026, 04:09 PM
Over 2,600 registers for Ayushman Bharat Hackathon; last day to apply today Mon, Apr 13, 2026, 04:06 PM