|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:58 PM
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ .. అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 875 రేటింగ్ పాయింట్లతో అతడు తొలి స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత బ్యాటర్ ఇషాన్ కిషన్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 871 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2026లో రెండు సెంచరీలు చేసిన పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్‌జాదా ఫర్హాన్.. 848 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (792 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానానికి పడిపోయాడు.
తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (742) ఒక స్థానం కోల్పోయి ఏడో ర్యాంకులో నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్ ఏకంగా (637 రేటింగ్ పాయింట్లు) ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకున్నాడు. శివమ్ దూబే (606) కూడా నాలుగు ర్యాంకులు పైకొచ్చి 27వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్ 2026లో 14 వికెట్లు తీసినప్పటికీ.. వరుణ్ చక్రవర్తి మాత్రం బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఫైనల్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి కాస్త ఎక్కువగా పరుగులు సమర్పించాడు. దీంతో అతడి పాయింట్లలో కోత పడింది. ఇదే సమయంలో అప్ఘానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (753) అగ్రస్థానానికి ఎగబాకాడు. వరుణ్ చక్రవర్తి ఏకంగా 68 పాయింట్లను కోల్పోవడం గమనార్హం. భారత పేసు గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా (702) ఒక స్థానం మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరాడు. అర్ష్‌దీప్ సింగ్ 16వ ర్యాంకు, అక్షర్ పటేల్ 17వ ర్యాంకులో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (328),హార్దిక్ పాండ్య (299) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Latest News