|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 06:23 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా వేరైనప్పటికీ.. రాజకీయాల పరంగా మాత్రం కాదనే చెప్పాలి. ఒక రాష్ట్ర రాజకీయాలపై మరో రాష్ట్రం రాజకీయం అంతో ఇంతో ప్రభావితం చూపుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలపై, పొరుగు రాష్ట్రాలకు చెందిన నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. వారు ఏమనుుకుంటున్నారనే ఆసక్తి ప్రజలలో ఉండటం సహజమే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులకు సంబంధించి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత . తండ్రి కేసీఆర్ గురించి, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇలా పలువురు నాయకుల గురించి తన అభిప్రాయాన్ని వన్ వర్డ్ అంటే ఒకే పదంలో చెప్పేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.
యాంకర్ అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల కవిత చెప్పిన సమాధానాల ప్రకారం.. కేసీఆర్ - గొప్ప ఉద్యమ నాయకుడు, రేవంత్ రెడ్డి - ఫ్లాప్ సీఎం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి - గుడ్ లీడర్, వైఎస్ జగన్ - గట్టి లీడర్, వైఎస్ షర్మిల - ఏపీకి సీఎం కావాలని కోరుకుంటున్నా.. బండి సంజయ్ - అన్నను గెలవనివ్వరు, ఏమీ చేయనివ్వరు .. ధర్మపురి అరవింద్- అబద్ధానికి ప్రతిరూపం, ఈటెల రాజేందర్ - గట్టి ఫైటర్, నారా చంద్రబాబు నాయుడు - ఈ వయసులో అద్భుతమైన పట్టుదలతో మళ్లీ సీఎం అయ్యేవరకూ కొట్లాడారు గ్రేట్, నారా లోకేష్ - నేర్చుకుంటున్నాడు నా లెక్కన, పవన్ కళ్యాణ్ - నాన్ సీరియస్ పర్సన్, కల్వకుంట్ల కవిత - ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ.. అంటూ బదులిచ్చారు కవిత. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే బీఆర్ఎస్ పార్టీకి, టీడీపీకి మధ్య సంబంధాలు అంతంతమాత్రమే అనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ నాయకులు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది. అయితే కల్వకుంట్ల కవిత మాత్రం నారా చంద్రబాబు నాయుడు పోరాడిన తీరును మెచ్చుకోవటం విశేషం. అలాగే వైఎస్ జగన్‌ను గట్టి లీడర్ అంటూ అభినందించారు కవిత. చంద్రబాబుతో పోలిస్తే, కేసీఆర్ కుటుంబానికి వైఎస్ జగన్‌తో కాస్త సాన్నిహిత్యం ఎక్కువనే చెప్పాలి. ఈ లెక్కన జగన్‌ను ప్రశంసించడం కంటే చంద్రబాబును మెచ్చుకోవటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Latest News