|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:43 AM
AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. దీంతో, సునీతా రెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, వివేకా హత్య కేసులో అప్పటిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అలాగే సీబీఐ అందించిన 13 లక్షల ఫైళ్లలో చాలా వరకు తెరుచుకోవడం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుల తరఫు న్యాయవాదుల వాదనను సీబీఐ ఈ సందర్భంగా తోసిపుచ్చింది. కోర్టు అనుమతి ఇస్తే ఈ ఫైళ్లను తెరిచి చూపిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసును మంగళవారానికి అంటే.. ఈ రోజుకు కోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Latest News