|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 12:11 PM
మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని YS జగన్ పక్కన పెట్టారని తెలుస్తోంది. ఆయనకు నేరుగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే కాకుండా, ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జి పదవి నుంచి తొలగించి, చంద్రగిరి నియోజకవర్గానికే పరిమితం కావాలని సూచించారు. సర్వేలు చేయకూడదని, సోషల్ మీడియా బాధ్యతలను కూడా లాక్కుని సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారని సమాచారం.ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( యాక్టివయ్యారు. చంద్రగిరి నుంచి రెండుసార్లు గెలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే గడిచిన ఎన్నికలకు ముందు ఆయన తన కుమారుడిని తెరపైకి తెచ్చి తాను తాడేపల్లి కార్యాలయానికి వస్తానని జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే టీంలను నడుపుతున్నారు.
Latest News