|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 03:41 PM
విశాఖపట్నంలోని పెదవాల్తేరులో గల ప్రసిద్ధ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ నూతన కార్యనిర్వాహణాధికారి (ఈఓ)గా టి. రాజగోపాల్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈఓగా పనిచేసిన కొవ్వూరి గాయత్రి సెలవుపై వెళ్లడంతో, ఆమె స్థానంలో రాజగోపాల్ రెడ్డిని నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
Latest News