|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 03:37 PM
టీ20 వరల్డ్ కప్-2026లో అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియాకు టైటిల్ అందించిన సంజూ శాంసన్, ఇప్పుడు టీ20 జట్టు కెప్టెన్ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసి “ప్లేయర్ ఆఫ్ ద సిరీస్” అవార్డు అందుకున్న అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిచాలని మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సూచించాడు. జట్టులో ప్రతి ఆటగాడిని ప్రోత్సహించే నాయకత్వ లక్షణాలు శాంసన్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై కూడా చర్చ కొనసాగుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయం BCCI తీసుకోనుంది.
Latest News