|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:26 PM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు సరఫరాపై ప్రభావం పడుతుండటంతో జీ7 దేశాలు అత్యవసర సమావేశం నిర్వహించనున్నాయి. ఇటీవల ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు జరపగా, ప్రతీకారంగా ఇరాన్ కీలక రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. చమురు దిగుమతులపై ఆధారపడిన భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ను స్థిరపరచేందుకు చమురు నిల్వల విడుదలపై జీ7 దేశాలు చర్చించనున్నాయి.గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. అంతే కాకుండా హర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు నిల్వలు పడిపోతున్నాయి. దీంతో సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జీ 7 దేశాలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
Latest News