|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:12 PM
అహ్మదాబాద్‌లో జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీమిండియా ఆటతీరును ప్రశంసించారు. 'టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. వారిని ఓడించాలంటే ప్రపంచంలోని ఉత్తమ జట్ల నుంచి ఉత్తమ ఆటగాళ్లను తీసుకువచ్చినా సాధ్యం కాదు. గ్రహాంతరవాసులను తీసుకువచ్చినా టీమిండియాను ఓడించలేరు. ఎందుకంటే ఆ జట్టు ఆటగాళ్లు ఇప్పుడు భీకరంగా ఆడుతున్నారు' అని విలియమ్సన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Latest News