|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 10:08 AM
AP: దేవరాపల్లి, వేపాడ, అనంతగిరి మండలాలకు చెందిన రైతులు వందలాది ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తారు. వ్యాపారులు ఇక్కడి నుంచి కూరగాయలు విశాఖ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఎగుమతి చేస్తారు. దేవరాపల్లి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో వారం కిందటి వరకు ధరలు బాగానే ఉండేవి. గత వారం నుంచి ధరలు పూర్తిగా పతనమయ్యాయి. 30 కేజీల టమాటా ధర రూ.80 లోపే ఉంది. అంటే కేజీకి రూ.2.5 మించి దక్కలేదు. వంకాయ ధర సైతం క్రేట్ రూ.100 మించడం లేదు. బెండ, బీర తదితర వాటి ధర అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.
Latest News