|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 11:08 AM
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళా జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అగ్రస్థానానికి దూసుకువచ్చారు. దుబాయ్‌లో మంగళవారం ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆమె రాణించడంతో 790 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్‌వార్ట్ రెండో స్థానానికి పడిపోయారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 9వ స్థానంలో, జెమీమా రోడ్రిగ్స్ 12వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ 10వ స్థానంలో నిలవగా, ఆల్‌రౌండర్ల జాబితాలోనూ ఆమె పదో స్థానంలో ఉంది.
Latest News