|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:07 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (05.03.2026) వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. వివాహ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. ఈ పర్యటనలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
Latest News