ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:10 PM

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, అటవీ శాఖకి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు . జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చర్చ. ⁠రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనుల గురించి తెలిపి అన్ని పంచాయతీల్లో ఈ తరహా డ్రెయిన్స్ నిర్మించడం ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని వివరించారు . నీటిపారుదలశాఖ పరిధిలోని డ్రైనేజ్ ల్లో పూడిక తీత అంశాన్ని ప్రస్తావించిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వేసవిలో పూడిక తీత పనులు చేపట్టి రైతులు పంటలు వేసేలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ⁠అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను ముఖ్యమంత్రివర్యులకు తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోపై పలు అంశాలపై మాట్లాడుకోవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి గారి నివాసంలో సమావేశం జరుగుతోంది.

Latest News
Sringeri recount row: Congress alleges postal ballot tampering, vows legal fight Tue, May 05, 2026, 03:35 PM
Vietnam Prez To Lam offers prayers at Mahabodhi Temple in Bodh Gaya Tue, May 05, 2026, 03:24 PM
India, Canada kick off second round of free trade talks Tue, May 05, 2026, 03:23 PM
India, Japan commit to stronger healthcare systems, resilient supply chains Tue, May 05, 2026, 03:21 PM
'Tamil Nadu, Kerala results show strength of Indian democracy' Tue, May 05, 2026, 03:06 PM