|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:23 PM
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సందర్భంగా రూపొందించిన చోకర్స్ థీమ్ ప్రకటనపై దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన కోచ్ షుక్రీ కాన్రాడ్ సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు ఆ ప్రకటన ప్రసారం కావడం ఇప్పుడు తిరగబడ్డట్టయిందని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టీమ్ ఘన విజయం సాధించి టీమిండియాను చిత్తు చేసింది. దీంతో టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు టీమ్ టు బీట్‌గా మారింది.
ఈ టోర్నీలో భాగంగా జింబాబ్వేతో చివరి సూపర్-8 మ్యాచ్ గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన కాన్రాడ్ “ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో ముఖ్యం. సీ (చోకర్స్) అనే మాటకు మరో అర్థం ఉంది – కప్‌కేక్స్. ఆ ప్రకటనను మేము ఆస్వాదించాం” అని సరదాగా వ్యాఖ్యానించారు.
గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచి చోకర్స్ ముద్రను తుడిచేసుకున్న దక్షిణాఫ్రికా, ఈసారి కూడా అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడబోతున్న నేపథ్యంలో, ఒత్తిడి గురించి ప్రశ్నించగా “సెమీఫైనల్ అంటేనే ఒత్తిడి. ప్రత్యర్థి న్యూజిలాండ్ అయితే మరింత. కానీ మేం మా ఆటతీరును మార్చం. అదే విధంగా సిద్ధమవుతాం” అని కాన్రాడ్ స్పష్టం చేశారు.
టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న కారణంగా ఫేవరెట్‌గా మారిన విషయంపై కూడా స్పందిస్తూ “ఫేవరెట్‌గా ఆడటం కూడా ఒక మంచి అనుభవమే. అండర్‌డాగ్‌గా ఉండటం కంటే ఇది బెటర్” అన్నారు. ఫైనల్ వేదికగా భావిస్తున్న అహ్మదాబాద్‌పై కూడా చమత్కారంగా స్పందించిన కాన్రాడ్ “ఇక్కడే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాం. ఇది మా హోం గ్రౌండ్‌లా మారిపోయింది” అంటూ నవ్వులు పూయించారు.
ఈ వ్యాఖ్యలతో దక్షిణాఫ్రికా జట్టు కేవలం ఆటలోనే కాదు, మానసికంగా కూడా ఎంత బలంగా ఉందో మరోసారి రుజువైంది. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి 4వ తేదీన మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.
Latest News