|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:14 PM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంది. దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్‌కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఫ్యూచర్స్‌లో బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు పెరిగింది. 2025 జనవరి తర్వాత ముడిచమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. గల్ఫ్ తీరంలో మూడు చమురు ట్యాంకర్లను దెబ్బతీశామని ఇరాన్ ప్రకటించడంతో సరఫరా నిలిచిపోతుందనే భయంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
Latest News