|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:15 PM
శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. హెచ్.టి హళ్లి వడ్రహట్టి గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి వీరేశ్ కుటుంబంలో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరేశ్ తన తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు రోహిణి, రచనలతో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన వీరేశ్ తరచూ ఇంట్లో గొడవ పడుతూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. భర్త వేధింపులు భరించలేకపోయారో లేక మరేదైనా కారణమో కానీ, అదే రోజు రాత్రి తల్లి సుబ్బమ్మతో కలిసి లక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.రెండు రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన బంధువులు ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రొళ్ల ఎస్సై గౌతమి.. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Latest News