|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:14 PM
టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన ఓపెనర్ సంజూ శాంసన్, తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తనపై తనకు నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఫోన్, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. తన అంతరాత్మను వినడం ద్వారానే తిరిగి ఫామ్‌లోకి రాగలిగానని, కీలక మ్యాచ్‌లో జట్టును గెలిపించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి భారత్‌కు 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Latest News