|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:12 PM
ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని కావున గల్ప్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఆయా దేశాల్లో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులు అందరూ నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు సరైన సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గగనతలంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమానాల రవాణా ఆలస్యం అవుతోందని, త్వరలోనే విమానయాన సేవలు పునరుద్దరిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.
Latest News