|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 01:56 PM
పొన్నూరు మండలం, మామిళ్లపల్లి గ్రామంలో రూ.36.90 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సోమవారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఎంఎన్‌ఆర్‌జీఎస్ నిధుల నుంచి రూ.13.45 లక్షలు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.23.45 లక్షలు ఈ నిర్మాణానికి వినియోగించినట్లు వివరించారు. గ్రామంలోని ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Latest News