|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 07:52 PM
భారత్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్ దేశాల్లో ప్రస్తుతం యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. యూపీఐ అంతర్జాతీయంగా ఆదరణ పొందడం వల్ల విదేశీ మారక ద్రవ్యం బదిలీలు పెరగడంతో పాటు, ఆర్థిక సమ్మిళితానికి ఊతం లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అందులో తూర్పు ఆసియా దేశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతున్నామని, ఇందులో భాగంగా యూపీఐ కోసం ఒక మార్గం అన్వేషిస్తున్నామని చెప్పారు. తద్వారా యూపీఐ సేవలందిస్తున్న ఫిన్‌టెక్ పరిశ్రమ.. ఆర్థిక రంగంలో కూడా అడుగు పెట్టడానికి వీలవుతుందన్నారు. తద్వారా దేశానికీ ప్రయోజనం చేకూరుతుందని నాగరాజు చెప్పారు.
Latest News