బలప్రదర్శన కాదు అభివృద్ధి ముఖ్యమన్న చంద్రబాబు
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 07:52 PM

వైసీపీ అధినేత జగన్ పరామర్శ యాత్రలపై సీఎం చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. పరామర్శల పేరుతో గంటల తరబడి ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టడం, బలప్రదర్శనలతో రౌడీయిజం చేయడం వంటి రాజకీయాలు తన దగ్గర చెల్లవని, ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా కేవలం రాజకీయం కోసం బలప్రదర్శనలు చేయడం సరికాదని, ఎన్నికల సమయంలో సత్తా చాటాలని ఆయన హితవు పలికారు. గతంలో కాన్వాయ్‌తో ఒకరి మరణానికి కారణమవ్వడం, బంగారుపాళ్యంలో మామిడి రైతుల కాయలను తొక్కించడం వంటి చర్యలు వారి రౌడీయిజానికి నిదర్శనమని విమర్శించారు. కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం, కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.గత ఐదేళ్ల పాలనలో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను దెబ్బతీసేలా కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేశారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. బాత్రూంలు శుభ్రపరిచే రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యితో లడ్డూలు చేయించారని, దీనిపై సీబీఐ, సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిందని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. తాము ఇప్పుడు ఆ తప్పును సరిదిద్ది, నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు.ఒకవైపు ప్రతిపక్ష రాజకీయ శైలిపై విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు తమ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను, ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి సంబంధించిన ప్రణాళికలను ఆయన వివరించారు. ఒకప్పుడు కరవుతో అల్లాడిన రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తున్నామని, ఏటా 200 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఈ ప్రాంతం నుంచే వస్తున్నాయని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి సౌకర్యాలతో సీమకు నీరందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. తాను రాయలసీమ బిడ్డనని, ఎన్టీఆర్ కూడా ఈ ప్రాంత ముద్దుబిడ్డేనని గుర్తుచేశారు.గత పాలకులు పోలవరాన్ని గోదాట్లో ముంచేశారని, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి రూ.400 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇప్పుడు తాము అదనంగా రూ.1000 కోట్లతో డయాఫ్రామ్ వాల్‌ను పునర్నిర్మిస్తున్నామని, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చి, శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించిన దూరదృష్టి తమదని పేర్కొన్నారు.రాయలసీమ లిఫ్ట్ పేరిట గత పాలకులు డ్రామాలు ఆడారని, అనుమతులు లేవని ఎన్జీటీ ఆపినా మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. తాము వెస్ట్ కర్నూలులో వేదవతి ప్రాజెక్టు, గురు రాఘవేంద్ర, రాజోలిబండ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గుండ్రేవుల ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రాలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, ప్రజలపై ఎలాంటి భారం మోపబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Latest News
Super 8 Showdown: Heavyweights collide as T20 WC 2026 enters decisive phase Fri, Feb 20, 2026, 04:51 PM
Former India cricketers share Top 4 predictions for T20 WCFormer India cricketers share Top 4 predictions for T20 WC Fri, Feb 20, 2026, 04:43 PM
Qualcomm, Tata Electronics to produce automotive modules in India Fri, Feb 20, 2026, 03:24 PM
'I won’t bat 15 overs to correct poor form and ignore the game': Jos Buttler Fri, Feb 20, 2026, 03:04 PM
Delhi Police say taking legal action after Youth Cong members breach security at AI summit Fri, Feb 20, 2026, 02:59 PM