|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:32 PM
అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 89 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు. వీరిపై హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలున్నాయి. 'వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్' (WOW) పేరుతో WOW.DHS.GOV వెబ్‌సైట్‌లో 25,000 మంది అక్రమ వలసదారుల వివరాలను పొందుపరిచారు. ట్రంప్ సర్కారు వీరిని సామూహికంగా బహిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని అంచనా.ఈ జాబితాలో ఉన్న 89 మంది భారతీయులపై హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ ట్రాఫికింగ్, దొంగతనాలు, హిట్ అండ్ రన్ కేసులు, మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికాలో తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి కారణమై ముగ్గురు మృతికి కారకుడైన హర్నీత్ సింగ్, ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్‌ప్రీత్ సింగ్ వంటి వారి పేర్లు కూడా ఈ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం ఈ బహిష్కరణలను 'నేషనల్ ఎమర్జెన్సీ'గా ప్రకటించి సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫెడరల్ అధికారులు మాస్కులు ధరించి, బాడీ కెమెరాలు లేకుండా దాడులు చేయడంపై డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిధుల కేటాయింపు విషయంలో సెనేట్‌లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ.. ట్రంప్ యంత్రాంగం ఇలాంటి విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు అమెరికాలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు.
Latest News