|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 02:58 PM
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో, ఇరాన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని వైట్‌హౌస్ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే వచ్చేయడం వీలుకాకపోతే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచించింది. విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉన్నందున వాణిజ్య విమానాలు అందుబాటులో ఉండగానే ఇరాన్ వీడాలని, ప్రయాణం సాధ్యం కాకపోతే రోడ్డు మార్గం ద్వారా అర్మేనియా, టర్కీ సరిహద్దుల వైపు వెళ్లాలని ఆదేశించింది. ఈ తరలింపు ప్రక్రియలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించవద్దని, సొంతంగానే ప్లాన్ చేసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది.
Latest News