|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 02:47 PM
తమిళనాడు రాజధాని చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. నగరంలో 1500లకు పైగా కాకులు మరణించాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ల్యాబ్‌లో పరీక్షించగా, ఈ కాకులలో అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (H5N1) వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (GCC), పశుపాలన శాఖ బృందాలు చనిపోయిన కాకులున్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ, పక్షులను సున్నం వేసి పూడ్చివేస్తున్నాయి. సరిహద్దుల్లోని పౌల్ట్రీ ఫారాలపై నిఘా పెంచారు.ఈ వైరస్ ఇతర జంతువులకు, అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో కేంద్ర పశువైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికలపై ఆంక్షలు విధించాలని సూచించింది. పశుసంవర్ధక శాఖ కూడా ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వెంటనే అధికారులకు తెలపాలని కోరింది. చనిపోయిన పక్షులను నేరుగా చేతులతో తాకవద్దని, వాటి కళేబరాలను కనీసం 8 అడుగుల లోతైన గొయ్యి తీసి పూడ్చివేయాలని హెచ్చరించింది.
Latest News