|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:35 PM
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన సంఘటనలో, వెండి ఆభరణాల కోసం దొంగలు 90 ఏళ్ల వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఆమెను సమీపంలోని పొలానికి తీసుకెళ్లి, కాళ్లు చేతులు కట్టేసి ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నించారు. అలికిడితో మేల్కొన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమె కోసం వెతకగా, దొంగలు వృద్ధురాలిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇంటి వరండాలో నిద్రించిన నాథీ దేవి అత్త అయిన 90 ఏళ్ల చోటీ దేవి చేతులు, కాళ్లకు 1.5 కేజీల వెండి కంకణాలు, ఆభరణాలు ఉండటాన్ని వారు గమనించారు.కాగా, ఇంట్లో నిద్రించిన కుటుంబ సభ్యులు బయటకు రాకుండా ఉండేందుకు దొంగలు డోర్‌కు తాళం వేశారు. మంచంపై నిద్రిస్తున్న చోటీ దేవి అరవకుండా ఆమె నోరు మూశారు. మంచంతో సహా ఆ వృద్ధురాలిని సమీపంలోని పొలం వద్దకు మోసుకుని వెళ్లారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. వాటికి ఉన్న వెండి కంకణాలు తొలగించేందుకు ప్రయత్నించారు.మరోవైపు అలికిడికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. ఇంటి బయట నిద్రించిన చోటీ దేవి మంచంతో సహా కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. డోర్‌కు తాళం వేసి ఉండటాన్ని గమనించి ఇరుగుపొరుగు వారిని అలెర్ట్ చేశారు. వారు వచ్చి డోర్‌కు ఉన్న తాళం పగులగొట్టారు. అంతా కలిసి చోటీ దేవి కోసం వెతకసాగారు.
Latest News