|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 11:18 PM
ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది వస్తువులకే కాదు, మనుషులకి కూడా వర్తిస్తుంది. మన ఇంట్లోని పెద్దవారితో మనల్ని కంపేర్ చేస్తే ప్రతీ దాంట్లోనూ వారు కాస్తా యాక్టివ్‌గానే ఉంటారు. టెక్నాలజీ పరంగా మనం ముందుంటామేమో కానీ, ఎనర్జీ పరంగా అయితే వారే ముందుంటారు. నడవడం, పనులన్నీ చేయడం ఇలాంటి వాటిలో వయసులో ఉన్నవారికంటే వృద్ధులే ముందుంటారు. దీనికి కారణాలు ఏంటో తన సొంత ఎక్స్‌పీరియెన్స్‌తో సహా చెబుతున్నారు డాక్టర్ నీరజా. అంతేకాదు, మనం కూడా పెద్దవారిలా యాక్టివ్‌గా ఉండేందుకు ఏం చేయాలో సూచిస్తున్నారు కూడా.
సొంత ఎక్స్‌పీరియెన్స్‌ని షేర్ చేసుకున్న డాక్టర్
డాక్టర్ నీరజా తన హాస్పిటల్‌లో రౌండ్స్‌కి వెళ్లినప్పుడు 98 ఏళ్ళ వయసున్న వృద్దులతో మాట్లాడినప్పుడు తన వినికిడి శక్తి కానీ, చూసే చూపు కానీ, అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. అదే తన వయసులో సగం ఉన్న డాక్టర్ పిల్లాడి కాలుని చెక్ చేయడానికి వంగడానికి చాలా ఇబ్బంది పడ్డానంటూ నవ్వుతూ చెప్పారు. అందరి ముందు కవర్ చేసుకుంటూ ఏదో మేనేజ్ చేశానని కానీ, ఈ వయసులోనే నేను సరిగా బెండ్ కాలేకపోతున్నాను దీనికి కారణాలు ఏంటో చెబుతున్నారు.
పెద్దవారు యాక్టివ్‌గా ఉండడానికి కారణాలు
మనం ఎందుకు వీక్‌గా ఉన్నామో తెలుసుకునేముందు పెద్దవారు ఎందుకంత స్ట్రాంగ్ ఉంటున్నారో కూడా తెలుసుకోవాలిగా ఆ వయసులో ఉన్నవారు వారి కాలంలో మంచి ఫుడ్ తీసుకునేవారు. చిరుధాన్యాలు, ముఖ్యంగా ఇంట్లోనే వండుకుని తినడం వంటివి చేసేవారు. అంతేకాదు, ఎంత తిన్నారో అంతకు మించి పనులు చేసేవారు. దీంతో వారు తిన్నదంతా అరిగిపోవడమే కాకుండా యాక్టివ్‌గా ఉండడానికి అదో కారణంగా ఉండేది.
యంగ్‌గా ఉన్నవారు వీక్ అవ్వడానికి కారణం
పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మనం పెరిగాం. కష్టపడే సమయం తగ్గింది.
ప్రతీ ఒక్కరూ డెస్క్ జాబ్స్‌కి అలవాటు పడ్డారు. దీంతో రోజులో కనీసం 10 నుంచి 12 గంటలు కూర్చునే జాబ్ చేస్తున్నాం. దీంతో పాటు ఇంటి ఫుడ్ తినడాని కంటే బయటి ఫుడ్‌తో పొట్టని నింపేస్తున్నాం.
వర్కౌట్స్ చేసినా గంటకి మించి చేయట్లేదు.
తిన్న ఆహారాన్ని అరిగించేంత పనులు ఉండట్లేవు.
ఈ కారణాలన్నింటి వల్ల వయసులో ఉన్నప్పటికీ కూడా మనం యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాం.
మరేం చేయాలి?
ఇప్పుడు మనకి సమస్య, పరిష్కారాలు రెండూ తెలిశాయి. కాబట్టి, మనం అవలంభించడమే తరువాయి.
వీలైనంతవరకూ చక్కని ఆహారం అంటే చిరుధాన్యాల్ని, ఆకుకూరల్ని, పోషకాహారాన్ని తీసుకోవాలి.
పైగా తిన్న ఆహారం ఖర్చయ్యే విధంగా పనులు చేయాలి.
బయటి ఫుడ్‌ని తగ్గించి ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడం మేలు.
డెస్క్ జాబ్స్ చేసినప్పటికీ మధ్యమధ్యలో లేచి నడవాలి.
మంచి నిద్ర, లైఫ్‌స్టైల్ ముఖ్యం.
ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత మంచిది.
ఒత్తిడికి దూరంగా ఉండాలి.
చిన్న చిన్న మార్పులతోనే సాధ్యం
ఇప్పుడు మనకి హాయిగా అనిపించిన అన్నీ అలవాట్లు మనకి ఫ్యూచర్‌లో ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి. ఈజీగా లైఫ్ సాగుతుందనుకోవద్దు. బాడీకి కష్టం కూడా తెలియాలి. ప్రతీ చిన్న పనికి మెషిన్స్‌పై ఆధారపడే బదులు మనమే కొన్ని నేరుగా చేయాలి. నడవడం, మెట్లు ఎక్కి దిగడం, తిన్న ఆహారానికి డబుల్ స్థాయిలో పనులు చేయడం వంటి ముఖ్యమైనవి ఫాలో అవ్వడం చాలాముఖ్యం. ముఖ్యంగా అన్నీ పోషకాలు అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
Latest News