|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 10:30 AM
దేశవ్యాప్తంగా PF అకౌంట్లు ఉన్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPFO వడ్డీ రేటును తగ్గించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం 8.25%గా ఉన్న వడ్డీని 8.20% లేదా 8%కు తగ్గించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి ప్రారంభంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపనున్నారు. వడ్డీ తగ్గితే కోట్లాది ఉద్యోగుల పీఎఫ్ ఆదాయం తగ్గే అవకాశం ఉంది.ఇదే సీబీటీ సమావేశంలో.. ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్‌పైనా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి ప్రస్తుతం రూ. 15 వేలుగా ఉండగా.. దీనిని రూ. 25 వేలకు పెంచాలని యోచిస్తోంది. ఇదే జరిగితే ఈపీఎఫ్ పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు వచ్చి చేరతారు. రూ. 15 వేల పరిమితి అంటే.. ఇక్కడ బేసిక్ పే ప్లస్ డీఏ కలిపి రూ. 15 వేల లోపు ఉన్న వారు కచ్చితంగా ఈపీఎఫ్‌లో చేరాలి. మిగతా వారికి ఆప్షనల్‌గా ఉంటుంది. ఇప్పుడు రూ. 25 వేలుగా ఈ పరిమితి పెంచితే.. మరింత మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
Latest News