|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:28 PM
జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా బంసంత్‌ఘర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ మావి అలియాస్ మావియా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, అటవీ ప్రాంతంలోని గుహలో దాక్కున్న తీవ్రవాదులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. మరో తీవ్రవాది వివరాలు తెలియాల్సి ఉండగా, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు గతంలోనే పోలీసులకు సమచారం అందింది. తాజాగా తీవ్రవాదులకు సంబంధించిన మరింత కీలక సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా జమ్మూ పోలీసులకు అందింది. దీంతో మంగళవారం నుంచి అక్కడ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో తీవ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒకడు మావి కాగా, మరొకడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Latest News