తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:36 PM

టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనం టోకెన్లు లేకపోయినా 5 - 6 గంటల్లో స్వామి వారి దర్శనం అయిపోతోంది. రూ. 300ల శీఘ్ర దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,389 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.72 కోట్ల ఆదాయం వచ్చింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. 


 

Latest News
Aussie pacer Josh Hazlewood ruled out of T20 WC Fri, Feb 06, 2026, 12:41 PM
Trump vows to protect US base at Diego Garcia Fri, Feb 06, 2026, 12:36 PM
RBI plans to allow bank lending to REITs: Governor Fri, Feb 06, 2026, 12:29 PM
Meghalaya coal mine tragedy: HC orders arrest of mine owners Fri, Feb 06, 2026, 12:27 PM
Police set to question interim CEO of Coupang again over perjury allegations Fri, Feb 06, 2026, 12:23 PM