|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:20 PM
భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించాలన్న నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావడంతో ఎగుమతులు పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. వ్యవసాయం, డెయిరీ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ అమెరికాతో భారత్‌కు మంచి డీల్ కుదిరిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, దుస్తులు వంటి రంగాలకు అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్‌టీటీ) పెంపు చిన్న ఇన్వెస్టర్లను రక్షించడానికేనని మంత్రి చెప్పారు.ఇక అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. డీల్ ప్రకటనకు ముందు మోదీకి.. ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
Latest News