ప్రజలకు నచ్చేది జగన్‌కు నచ్చదు: మంత్రి సత్యకుమార్
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 02:20 PM

 ప్రజలకు నచ్చేది వైసీపీ అధినేత జగన్‌కు నచ్చదని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. గతంలో సుదీర్ఘకాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతలు రోడ్ల మీదకు వచ్చేవారని, ప్రస్తుతం ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు రోడ్డు మీదకు వస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజల్లో మంచి అభిప్రాయం లేకుండా పోయిందన్నారు.ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న కేసులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాథమిక పరీక్షలు, గుర్తించిన అంశాలు, తీసుకోబోతున్న చర్యలను మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలో 2007-2008 నుంచి 2025-26 జనవరి 24వరకు క్యాన్సర్ తో బాధపడుతున్న 6 లక్షల 32 వేల 426 మందికి ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా ఉచితంగా అందించిన వ్యయం 4,751.82 కోట్లకు చేరుకుందని తెలిపారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 675.66 కోట్లను క్యాన్సర్ పీడితులకు వైద్యాన్ని అందించేందుకు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. 2025-26 లో జనవరి 24 వరకు 585.22 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు.

Latest News
Pakistan facing 'water bankruptcy': Report Thu, Feb 05, 2026, 02:20 PM
India women rally behind the men's team ahead of T20 World Cup Thu, Feb 05, 2026, 02:17 PM
PM Modi to host BJP Councillors on Feb 13 to celebrate 'historic' win in Thiruvananthapuram Corporation Thu, Feb 05, 2026, 01:46 PM
Jharkhand: Three of a family killed, two injured in elephant attack in Bokaro Thu, Feb 05, 2026, 01:19 PM
Ask Rahul Gandhi to follow House rules, Rijiju to Kharge in RS amid ruckus (Ld) Thu, Feb 05, 2026, 12:52 PM