|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 02:22 PM
మనం తినే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలు ఉన్నప్పటికీ, తిన్న వెంటనే టీ తాగడం వల్ల అందులోని టానిన్లు, పాలీఫెనాల్స్ పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయlని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలోని టానిన్లు ఐరన్‌తో బంధాన్ని ఏర్పరచి, రక్తహీనతకు దారితీస్తాయి. కెఫిన్ జీర్ణ ఎంజైమ్‌లను నిరోధించి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది. పోషకాల గ్రహణ శక్తి తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని పేర్కొంటున్నారు.
అయితే భోజనం తర్వాత ఏమి తాగాలి?
గోరువెచ్చని నీరు, సోంపు నీరు, మజ్జిగ.. జీర్ణానికి సహాయపడే హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు. టీ ఆరోగ్యానికి పూర్తిగా చెడు కాదు. కానీ తినే సమయానికి దగ్గరగా తాగితే పోషకాల శోషణపై ప్రతికూల ప్రభావం పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ చిన్న అలవాట్లే భవిష్యత్ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. భోజనం వెంటనే టీ తాగడం మానేసి.. కొద్దిసేపు విరామం ఇవ్వడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి, శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి.