|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 02:00 PM
జపాన్‌లోని అనేక ప్రాంతాల్లో గత రెండు వారాలుగా భారీ హిమపాతం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 72 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. అతిశీతల వాతావరణం కారణంగా గుండెపోటు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. భారీ మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థతో పాటు ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జపాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి మాట్లాడుతూ.. భారీగా మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. మంచును తొలగించడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామన్నారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని.. రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Latest News