చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నానాపాట్లు పడుతున్నారు
 

by Suryaa Desk | Wed, Feb 04, 2026, 01:55 PM

తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో జంతుకొవ్వు, పంది కొవ్వు, చేపనూనె కలిపిన నెయ్యి వాడారని పచ్చి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, అందులో ఏ మాత్రం వాస్తవం లేదన్న సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌తో అడ్డంగా దొరికిపోయి, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన సిట్, నెయ్యిలో ఏ కొవ్వూ కలవలేదని చెప్పినా, మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేయించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి చేతనైతే సిట్‌ రిపోర్ట్‌ తప్పని సుప్రీంకోర్టును ఆశ్రయించి, అక్కడ రుజువు చేయాలని తిరుపతిలో మీడియాతో మాట్లాడిన భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్‌ చేశారు.

Latest News
HM Amit Shah arriving on 3-day J&K visit today Thu, Feb 05, 2026, 11:13 AM
ICC reveals broadcast details for Men’s T20 World Cup 2026 Thu, Feb 05, 2026, 10:55 AM
10 semiconductor projects approved, 4 reach pilot production: Minister Wed, Feb 04, 2026, 04:40 PM
BJP-JD(S) harassing Dalit Minister, alleges Karnataka Deputy CM Shivakumar amid overnight protest Wed, Feb 04, 2026, 04:35 PM
Bihar RJD chief Mangani Lal Mandal hospitalised in Delhi for liver treatment Wed, Feb 04, 2026, 04:34 PM