|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 01:53 PM
తిరుమల లడ్డూ వ్యవహారంలో గత మా ప్రభుత్వంపై వేసిన నిందను సమర్థించుకునేందుకు, ఒక తప్పును ఒప్పు అని చెప్పేందుకే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని ఇన్నాళ్లూ సీఎం, డిప్యూటీ సీఎం చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రతిష్టాత్మక ల్యాబ్‌లు ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ తేల్చి చెప్పడం, అదే విషయాన్ని సుప్రీంకోర్డు నియమించిన సిట్ కూడా తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడంతో, దిక్కు తోచని ప్రభుత్వం.. మళ్లీ విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం తప్పు అని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Latest News