|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 01:51 PM
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు. టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ఆయన సందర్శించనున్నారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దాడిలో అంబటి కుటుంబ సభ్యులపై హత్యాయత్నం జరిగింది. అనంతరం అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో వైయస్ జగన్ గుంటూరుకు చేరుకుని వైయస్ఆర్‌సీపీ నేతలతో కలిసి అంబటి రాంబాబు నివాసాన్ని పరిశీలించనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
Latest News