|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 12:48 PM
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్.ఎల్.సి (HLC) అధికారులు మరియు వాటర్ యూజర్స్ అసోసియేషన్ (WUA) అధ్యక్షులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొన బండారు శ్రావణి శ్రీ . ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ నీటి వనరులు, చెరువులు, కాలువలకు సంబంధించిన సమస్యలపై సమగ్రంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పలు కీలక అంశాలను సమావేశంలో ప్రస్తావించి, వాటిపై తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. పుట్లూరు మండలంలోని కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి, బొప్పేపల్లి చెరువులకు నీరు విడుదల చేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మిగిలిన డిస్ట్రిబ్యూటర్ల పరిధిలోని రైతుల వాస్తవ పరిస్థితులను వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివరించి, పరస్పర సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.గ్రామాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సకాలంలో నీటి సరఫరా జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.సమావేశంలో .. బుక్కరాయసముద్రం చెరువుకు సంబంధించిన సమస్యలు, బి. పప్పూరు మరియు చిన్న చెరువుకు సంబంధించిన సమస్యల, దుర్గం చెరువుకు సంబంధించిన అంచనాలు (ఎస్టిమేట్స్), చామలూరు గ్రామంలో చెక్‌డ్యామ్ పనులు ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంపై వివరణ కోరడం జరిగింది. అలాగేగూగుడు చెరువు నుంచి నడింపల్లి గ్రామానికి నీరు విడుదల చేయడంతో పాటుసలకంచెరువుకు నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) అంశం, పశ్చిమ నరసాపురంలోని దేవుల చెరువుకు నీరు విడుదల చేయడం, శింగనమల చెరువులో లోకలైజేషన్ చేపట్టి నీటి విడుదలకు అవసరమైన స్లూయిసులు ఏర్పాటు చేయడం,
పీఏబీఆర్ కాలువ నుంచి దుర్గం చెరువు మరియు బి. పప్పూరు చెరువులకు నీరు విడుదల చేసే అంశం, కొన్ని కాలువలకు జంగిల్ క్లియరెన్స్ మరియు కాలువ లైనింగ్ పనుల అవసరం, కొత్త ఆప్టిక్ పాయింట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించాము. అదేవిధంగా షట్టర్ మరమ్మత్తులు లేదా చిన్నపాటి మరమ్మత్తులు అవసరమై ఉన్న ప్రాంతాలపై సమీక్ష, మదిరేపల్లికి సంబంధించి కాలువల లైనింగ్ గురించి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో హెచ్.ఎల్.సి అధికారులు, మైనర్ ఇరిగేషన్ అధికారులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్.ఎల్.సి (HLC) అధికారులు మరియు వాటర్ యూజర్స్ అసోసియేషన్ (WUA) అధ్యక్షులతో నిర్వహించిన సమన్వయ సమావేశం
Latest News