|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 12:04 PM
నంద్యాల ఎస్బీఐ కాలనీ సర్వే నెం. 2299లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్లను అకస్మాత్తుగా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆంక్షలు విధించడంతో ఆ ప్రాంతంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. జీఓ ఎంఎస్ 310 ప్రకారం ఈ ఆంక్షలను తొలగించాలని కోరుతూ స్థానికులు అధికారులను ఆశ్రయించారు. తమకు న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి ప్రజాదర్బార్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు బాధితులు తెలిపారు.
Latest News