|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:03 PM
గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో ధ్వంసం అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. దాడిలో జరిగిన నష్టాన్ని పరిశీలించి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు ఈ సందర్భంగా అంబటి కుటుంబ సభ్యులను కలసి ధైర్యం చెప్పారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని నాయకులు డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు దొంతి రెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబులు తదితరులు పాల్గొన్నారు.
Latest News